Telangana Election: ఎన్నికల కమిషన్ కొత్తగా పన్నెండు వర్గాలకు ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రారంభించింది. 80 ఏళ్ల వయసు పైబడినవారు, దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించారు. వృద్ధులు, దివ్యాంగులు ముందుగా ఫారం డి-12 సమర్పిస్తే ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారికి బీఎల్ఓ సిఫార్సు చేస్తారు. తెలంగాణలో నవంబర్ 30వతేదీన పోలింగ్ తేదీ కాగా ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, దివ్యాంగులకు అనుమతించారు. తెలంగాణలో 28,057 మంది ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు ఎన్నికల అధికారులు అనుమతించారు.
పోలింగ్ సిబ్బంది, ఎన్నికల పరిశీలకుడి సమక్షంలో వయోవృద్ధులు ఇంటి నుంచే ఓటు వేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేశాక వాటిని పోలింగ్ సిబ్బంది సేకరించి తీసుకువెళతారు. ముందుగా సమాచారం అందించి ఓటు వేయించేందుకు పోలింగ్ సిబ్బంది ఇళ్లకు వస్తున్నారు. ఎన్నికల కమిషన్ నియమించిన అధికారి సమక్షంలో ఓటు వేయించుకొని దాన్ని పోలింగ్ కేంద్రాలకు పంపాలి. ఇంటి నుంచి ఓటేసే ప్రక్రియ తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో చురుకుగా సాగుతోంది.