world cup final: భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ 2023 మ్యాచ్ నవంబర్ 19న ఆహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోతున్న విషయం మనదారికి తెలిసింది. ఆ క్రమం లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ చేసిన వ్యాఖ్య వైరల్‌గా మారింది. ఐపిఎల్ 2023 లో దిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రతినిధ్యం వహించిన మిచెల్ మార్ష్ త్వరలో భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్పు లో తమ టీమ్ ఆస్ట్రేలియా కచ్చితం విజియమ్ సాధిస్తుంది అని భవిష్యత్తును అంచనా వేశారు. అసలు విష్యం ఏమిటి అంటే ? ఐపిఎల్ జరుగుతున్న సమయంలో దిల్లీ క్యాపిటల్స్ పోడ్ కాస్ట్ లో పాల్గొన్న మార్ష్ మాట్లాడుతూ..
భారత్ వేదికగా జరగనున్న ప్రపంచ కప్పు ఎవరు ఫినల్స్ కు వస్తారు అని అడిగిన ప్రశ్నకు మార్ష్ బదులు ఇస్తూ.. ఫైనల్ కు ఇండియా మరియు ఆస్ట్రేలియా వస్తాయి అని ఆస్ట్రేలియా విజయం సాదిస్తుంది 2003 ఫైనల్ మ్యాచులో భారత్ 234 పరుగులకే ఆలౌట్ అయ్యారు, అంతకు ముందే ఆస్ట్రేలియా బ్యాటింగ్ 359/2 పరుగులు చేశారు. అలా 2003 లో ఆస్ట్రేలియా ఆ మ్యాచులో కప్పు సొంతం చేసుకోవడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ అలానే జరుగుతుంది అని చెప్పుకొచ్చాడు. ఒక వేల ఫైనల్ మ్యాచులో టీమిండియా గెలిచితే, నెటిజన్లు మార్ష్‌ను ట్రోల్స్ చేయడం పక్కా.