తెలంగాణ ఎన్నికలలో బాగంగా బిజెపితో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలి అని పనిచేస్తుంది. బిజెపితో పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేనకు కేటాయించారు. అందులో ప్రధానంగా కూకట్ పల్లి నియోజకవర్గం సీటులో తప్పకుండా గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పుడు జనసేన పార్టీ మరో జనసేన పార్టీ నుంచి ముప్పు వచ్చేలా కనిపిస్తోంది. కూకట్ పల్లి లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జాతీయ జనసేన అనే పార్టీ జాబితాలో కనిపించింది. ఆ పార్టీ ఎన్నికల గుర్తుగా బకెట్ ఉంది.
పవన్ కల్యాణ్ జనసేన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు జాబితాలో కనిపించిన జనసేన ఎన్నికల గుర్తు బకెట్ ఈ రెండు గుర్తుల ఒకే విధంగా ఉండే సరికి ఉద్దేశపూర్వకంగా రాజకీయ ప్రత్యర్థులు జనసేన ఓట్లకు గండి కొట్టే విధంగా ఈ ప్లాన్ చేశారని జనసేన వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. కూకట్ పల్లిలో జనసేన అభ్యర్ధి ముమ్మడి ప్రేమ్ కుమార్ పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ గా ఉత్తరాంధ్ర ప్రాంతం వారు ఉండడం తో , అది తమకు కలిసి వస్తుంది అని జనసేన అంచనా వేసుకుంటోంది. కానీ ఇప్పుడు జనసేన పేరును పోలి ఉండే విధంగా ఉన్న జాతీయ జనసేన పోటీలో ఉండడం తో , జనసేన టెన్షన్ పడుతోంది. బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగానే జాతీయ జనసేన పార్టీని ఏర్పాటు చేయించింది అని , అందుకే జనసేన గుర్తు ను పోలి ఉన్న బకెట్ గుర్తు తో ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారని మండిపడుతున్నారు.