Bigg Boss 7 Telugu: వరుడు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భాను శ్రీ మెహ్రా. ఆ సినిమా ప్రేక్షకులను అంతాగా ఆదరించకపోయిన భాను శ్రీ కి ఆ సినిమా తో మంచి పేరు వచ్చింది. కానీ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడం తో ఆ తరువాత భాను శ్రీకి తెలుగులో ఎక్కువగా అవకాశాలు రాలేదు. చిన్నా చితకా చిత్రాలు చేసినా హిట్టు కాలేదు. అలా కొంత కాలానికి భాను శ్రీ టాలీవుడ్‌కు దూరం అయింది. ఆ మధ్య భాను శ్రీ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బన్నీ తనను ట్విట్టర్లో బ్లాక్ చేశాడంటూ ట్విటర్ హాల్ చల్ చేసింది. ఆ తరువాత బన్నీ మళ్లీ అన్ బ్లాక్ చేయడం తో ఆ వివాదం కొలిక్కి వచ్చింది.
మళ్లీ ఇప్పుడు భాను శ్రీ బిగ్ బాస్ షో మీద కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ లాంటి షోను జనాలు అసలు ఎలా చూస్తారో నాకు అర్థం కాదు.. జనాలను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది.. ఇంకా కొత్త సీజన్లు వస్తూనే ఉన్నాయి.. నా దృష్టిలో టీవీలో వచ్చే షోలన్నింటిలో ఇదొక్కటే మైండ్ లెస్, చెత్త షో అంటూ బిగ్ బాస్ షోకు సంబంధించిన చెత్త అంతా నా ఇన్ స్టాగ్రాం ఖాతాలోనే కనిపిస్తోందంటూ వాపోయింది. దానితో ఏ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.