Bigg Boss 7 Telugu: తొమ్మిదో వారం లో జరిగిన నామినేషన్ లో అర్జున్..శోభాని నామినేట్ చేశాడు. 8 వారాల నుంచి నేను..తప్పు చేయను నేను.. కరెక్ట్‌గా ఉంటాను.. తప్పు చేస్తే సారీ చెబుతాను.. ఇలా ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలే కానీ లాస్ట్ వీక్ నీకు తెలుసో నువ్ చేపింది అబద్ధం అని తేలిపోయింది. ఒక పాయింట్‌ని నీ వెర్షన్లో ఊహించుకొని దాన్నే కరెక్ట్ అని చెప్పి రియలైజ్ అవ్వకుండా పక్కోళ్లు చెప్పిన తర్వాత తెలుసుకొని.. రియలైజ్ అయ్యావ్.. అలానే ఫౌల్ గేమ్స్ ఆడావ్ అని అర్జున్ తన నామినేషన్ రీసన్ చెప్తుంటే ఎప్పట్లానే మధ్యలో శోభా అందుకుంది. ఎంటి ఇప్పుడు ఈ కారణం తో నేను ఇంటి నుంచి బయటికెళ్లిపోవాలా.. అంటూ అడిగింది. దానికి నేను ఓటేయగానే వెళ్లిపోతావని నువ్వు నమ్ముతున్నావా.. అని అర్జున్ అడిగాడు. చెప్పలేం కదా ఆ స్థితి వరకు వెళ్లొచ్చాను కదా.. మాస్టర్ వెళ్లిపోయారు.. అంటూ శోభా అంది. ఈ నామినేషన్ పెట్టుకొని వీక్ బాగా ఆడితే అది నీకు ప్లస్ అవుతుంది.. అని అర్జున్ అన్నాడు. నీకు అందరూ చేసిన ఫౌల్ కనిపించలేదు.. నేను చేసింది మాత్రమే కనిపించిందా.. అంటూ శోభా అడిగింది.
నేను నువ్వు ఒకదానివే తప్పు చేశావని చేపట్లేదు.. మజాక్ మజాక్లో అన్నా అని సద్ది చెప్పా ప్రయత్నం చేశాడు అర్జున్. అది మనకి మజాక్.. కానీ బయట చూసేవాళ్లకి అది మజాక్ కాదు శోభా.. ఈ వీక్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని గట్టిగా ఆడు.. అని అర్జున్ అనేసరికి శోభా శెట్టి కోపం తో నాకు నువ్ చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలుసు నా గేమ్ ఎలా ఆడాలో.. ప్రతి ఒక్కరికీ నువ్వు చెబుతావ్ కదా సిల్లీ రీజన్‌తో నామినేట్ చేస్తారని.. నువ్వు కూడా నన్ను ఈరోజు సిల్లీ రీజన్‌తోనే నామినేట్ చేశావ్.. అంటూ కోపంగా వెళ్లి ముఖాన రంగు కొట్టించుకుంది శోభా. ఇది సిల్లీ రీసన్ అయితే నాగార్జున సర్ చెప్తారు కదా.. అని అర్జున్ అన్నాడు. చెప్పినప్పుడు క్లారిఫై అయింది కదా.. శోభా. వీకెండ్ క్లారిఫై చేస్తే ఏంటి.. లాస్ట్ వీక్ చూసినదాన్ని బట్టే కదా నామినేట్ చేస్తాం.. జరగబోయేదాన్ని ఊహించి చేస్తామా.. ఈ ఒక్కదానికి ఆన్సర్ చెప్పు.. అని అడిగాడు అర్జున్. తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. అంటూ శోభా పిచ్చిపిచ్చిగా ఆన్సర్ చెప్పి.. అర్జున్‌ని తీసుకొస్తా బిగ్‌బాస్ బ్లాక్ కలర్ రెడీ పెట్టుకోండి.. అంటూ కూర్చుంది.
ఇక తర్వాత అమర్‌ని నామినేట్ చేశాడు అర్జున్. అడిగినోడే ఒప్పుకున్నాడు.. ఇక వాయింపు దేనికి.. పబ్లిక్‌గా ఒప్పుకున్నా.. గెలవాలనే హీట్‌లో తప్పు చేశాను ఒప్పుకున్నాను.. అని అమర్ అంటే.. నువ్వు వచ్చినప్పుడు ఏం ప్రామిస్ చేశావ్.. అన్నా ఇక ఆడతానన్నా అన్నావ్ రెండు వారాలు పొగిడారు.. ఏమైంది మరి.. అని అర్జున్ అడిగాడు. అది నా తప్పే ఒప్పుకుంటున్నా.. దీన్ని ఎక్కువ లాక్కూడదన్నా.. దరిద్రం నాకే పడతాది.. పొమ్మంటే నేను పోతా అక్కడికి.. పబ్లిక్‌లో ఒప్పుకున్న దాన్ని తీసుకొచ్చి నామినేషన్స్‌లో వేస్తున్నావ్.. అని అమర్ కాస్త తిట్టుకున్నాడు.