Bigg Boss 7 Telugu: బిగ్బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం కొనసాగుతోంది. ఈ వారం కి సంబందించిన నామినేషన్స్ సోమవారం హౌస్ జరిగాయి. ఈ ప్రక్రియ లో బాగంగా ప్రియాంక.. రతికని నామినేట్ చేసింది. వైల్డ్ కార్డ్లో వచ్చావ్.. బాంబ్లా ఆడతావ్ అనుకున్నా.. కానీ అంతా అనిపించలేదు.. నేను అనుకున్నదాంట్లో కొంచెం కూడా దగ్గరికి రాలేకపోయావ్.. రి-ఎంట్రీ తర్వాత ఒకే చోట ఉండిపోయావ్ అనిపించింది.. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ కూడా పెద్దగా ఆడలేదు.. అంటూ తన రీజన్స్ చెప్పి అందుకే రతికని నామినేట్ చెయ్యాలి అని అనుకుంటున్న అని చేపింది ప్రియాంక.
దానికి దీటుగానే సమాదనం ఇచ్చింది రతిక.. బాంబ్లాగ అంటే ఎలా గట్టిగా గట్టిగా అరవాలా.. ఒకే చోట ఉండిపోయావ్ అంటున్నావ్ నేను మీ అందరితోనూ మాట్లాడుతున్న అందరిని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్న ఎప్పుడు ఒకే చోట ఉండిపోలేదే నేను ఇక్కడ ఎవరితో మాట్లాడలేదు చెప్పు.. అంటూ రతిక తనని తాను డిఫెన్స్ చేసుకునే ప్రయత్నం చేసింది. అయిన ఒకే చోట ఎక్కువ ఉంటున్నావ్ అన్నా.. అంటూ ప్రియాంక చెప్పింది. ఒకే చోట ఉంటునానో లేదు నా క్లారిటీ నాకు ఉంది..రతిక. కానీ ప్రియాంక మాత్రం రతిక ని.. నేను ఏంటో చూపిస్తా అన్నావ్ కదా ఈ వీక్ నాగ్ సార్ దగ్గర.. మరి లాస్ట్ వీక్ ఎందుకు చూపించలేదు.. అంటూ ప్రియాంక కొంచం వంగ్యంగా ప్రశ్నించింది. దీనికి రతిక సరిగ్గా సమాదనం చెప్పలేదు.
ఇక ఆ తర్వాత భోలేని తన రెండో నామినేషన్గా సెలక్ట్ చేసింది ప్రియాంక. తన పేరు చెప్పగానే భోలే వంగ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. యస్ ప్రియాంక.. ప్రెసెంట్.. అంటూ లేచి నిల్చున్నాడు. దానికి కొంచం కోపంగా మీరు నన్ను కెప్టెన్సీ రేసు నుంచి తప్పించిన పాయింట్ నచ్చలేదు.. అని ప్రియాంక చెప్పింది. మిరపకాయలు.. సర్రు అన్నదా కోపం.. మిరపకాయలతో తాలింపు బాగా వేస్తావ్.. ఆ ఘాటు తట్టుకోలేవురా నువ్వు.. నా ఓటు నా హక్కు.. అంటూ భోలే అన్నాడు. అవును నాకు ఓటేసి తప్పించారు అందుకే నామినేట్ చేశా అని ప్రియాంక అంది. పోటు వేశా నేను ఓటు వేయలే.. అంటూ భోలే మళ్లీ ప్రియాంక ని రాగింగ్ చేసి కొంచం కామిడీ పండించాడు. దీంతో మీతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు.. అంటూ ప్రియాంక కాస్త అగ్రెసివ్ అయింది.
ఇగో ఈ అగ్రెసివ్ ప్రవర్తన నచ్చకె నిన్ను తప్పించినా.. అంటూ భోలే కౌంటర్ ఇచ్చాడు. చివరికి నీ విషానికి బలైన చావాలి.. అంటూ భోలే అనడంతో సార్ అలాంటి పెద్ద మాటలు మాట్లాడొద్దు అంటూ ప్రియాంక అంది. ఇప్పుడు నువ్వు నన్ను పంపేది ఆ స్నేక్ బొమ్మ దగ్గరకే కదా.. దాని నోటి నుంచి వచ్చేది విషమే కదా అంటూ భోలే రియాక్షన్ ఇచ్చాడు. తెలుగు బాగా తెలిసినోడ్ని.. నీకు అంతంత మాత్రం వచ్చు.. తెలుగులో నాతో పెట్టుకోకు.. నేను మాట్లాడే ప్రతి మాట వాస్తవం.. అంటూ గట్టిగా నవ్వాడు భోలే. అలా నవ్వడం నాకు రాదులెండి అని ప్రియాంక అంది.. ఆ నవ్వే అలా ఉంటది.. అందులో లవ్వు ఉంటది తెలుసుకో.. అంటూ భోలే మళ్లీ పంచ్ వేసేశాడు.