Chandra Babu: సైబర్ టవర్స్ 25ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా ఐటి ఉద్యోగులు గచ్చిబౌలి స్టేడియంలో ఆర్పాటు చేసిన చంద్రబాబుకు కృతజ్ఞతగా కార్యక్రమం లో పాల్గొన్నారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇక ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. వీకెండ్ కావడంతో ఐటి ఉద్యోగులు, టీడీపీ అభిమానాలు పెద్ద ఎత్తున ఈవెంట్ లో పాల్గొన్నారు. అంతే కాకుండా చంద్రబాబు గారికి తమ కృతజ్ఞతను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ తెలుగు భాష తెలుగు చరిత్ర ఉన్నంతవరకు తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉంటారని వ్యాఖ్యానించారు. బాబు బయటికి రావాలి వచ్చిన వెంటనే అధికారంలోకి రావాలని అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా వచ్చిన ఐటీ ఉద్యోగులకు బోయపాటి శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. మీరు ఇలా ముందుకు వచ్చి చంద్రబాబు గారికి మద్దతు తెలపడం చాలా మంచి విషయం.
ఇలా ముందుకు వచ్చాక కూడా మేము బయటికి రాకపోతే మంచి పద్ధతి కాదు అని అందుకే ఈ రోజు ఇలా బయటికి వచ్చను అని తాను చివరి శ్వాస వరకు చంద్రబాబు నాయుడు గారి వెంటే ఉంటా అని చెప్పారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మీరు ఇలా కదలి రావడం మీకే కాదు మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అని వ్యాఖ్యానించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ప్రపంచంలో తలెత్తుకునేలా చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని వెల్లడించారు.